Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

బెంగళూరులో తీవ్ర నీటి కరవు

బెంగళూరు నగరవాసులు తీవ్ర నీటి కొరతను ఎదుర్కొంటున్నారు. మరో 15 రోజుల్లో ఉన్న నీటి వనరులు కాస్తా తుడిచిపెట్టుకుపోతాయని, ఆ తర్వాత నీటి కటకటలేనని అక్కడి అధికారులు భయపడుతున్నారు. ఇప్పటికే హిరల్ దిల్లా, రాజాజినగర్ మరికొన్ని ప్రాంతాల వారు నీటిని కొనుక్కునే పరిస్థితి ఏర్పడింది. నగరానికి ముఖ్య నీటి వనరు అయిన కృష్ణరాజ సాగర్ లో నీటి మట్టం డెడ్ స్టోరేజీ లెవల్ 65 అడుగుల కంటే ఒక అడుగు కిందకు తగ్గిపోయింది. టీజీ హల్లి రిజర్వాయర్ లోనూ ఇదే పరిస్థితి. నీటి కొరతను తీర్చేందుకు తగిన ప్రణాళిక లేదని వాటర్ బోర్డు అధికారులు అంటున్నారు. మరోవైపు మైసూర్ వాసులూ నీటి కొరతతో సతమతమవుతున్నారు. ముందస్తుగా వర్షాలు పడితే తప్పించి కష్టాలు గట్టెక్కవని అక్కడి వారు భావిస్తున్నారు.

More Telugu News